హైదరాబాద్‌లోని మెట్టుగూడలో పిచ్చికుక్కలు(street dogs) స్వైర విహారం చేస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే ఏడుగురు పిల్లలపై దాడి(dog bites) చేశాయి. బయట ఆడుకుంటున్న చిన్నారులపై శునకాలు ఒక్కసారిగా దాడి చేయగా... పిల్లల కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Street Dogs Attack: పిచ్చికుక్కల స్వైర విహారం.. ఏడుగురు చిన్నారులకు గాయాలు - తెలంగాణ వార్తలు
మెట్టుగూడలో పిచ్చికుక్కలు(street dogs) బీభత్సం సృష్టించాయి. బయట ఆడుకుంటున్న చిన్నారులపై ఒక్కసారిగా దాడి చేసి.. పిల్లలను తీవ్రంగా గాయపర్చాయి(dog bites). గాయాలైన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పిచ్చికుక్కల స్వైర విహారం, చిన్నారులపై పిచ్చికుక్కల దాడి
స్థానికులు వాటిని వెళ్లగొట్టే క్రమంలో ఒక కుక్క మృతి చెందగా... మిగిలిన రెండింటిని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయని స్థానికులు వాపోయారు. బయటకు రావాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్ సిబ్బంది స్పందించి... కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:accident: మణుగూరు ఓపెన్‌కాస్ట్-2లో ప్రమాదం.. ముగ్గురు మృతి