Street Dog Attacks In Telangana: తెలంగాణలో వీధి కుక్కల దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. మొన్న హైదరాబాద్లోని అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మరవకముందే ఆ మరుసటి రోజే చైతన్యపురిలో మరో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తల్లిదండ్రులు అప్రమత్తమవ్వడంతో ఆ బాలుడు బతికిపోయాడు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో 14 మందిపై, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరిపై, ఖమ్మం జిల్లాలో ఓ బాలుడిపై కుక్కలు దాడికి తెగబడ్డాయి.
Street Dogs Are Causing Havoc In Telangana: రంగారెడ్డి జిల్లాలోని యాచారం గ్రామంలో గురువారం రోజున ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలోని 10 మందిపై దాడి చేసి గాయపరిచింది. యాచారం గ్రామానికి చెందిన కొమురయ్య(65), మల్కీజ్‌గూడెంకు చెందిన వెంకటమ్మ(60), బోడ వెంకటమ్మ(55), గృహిణి రేణుక(32), గడల నందీశ్వర్(28), రాములమ్మ(60), నందివనపర్తి గ్రామస్థుడు సుధాకర్(50), మొండిగౌరెల్లి గ్రామస్థుడు శ్యాంసుందర్(26), బోడుప్పల్ వాసి చెందిన మహేశ్(36), ఇబ్రహీంపట్నం వాసి సాయమ్మ(55) గాయపడ్డారు.
Street dog attacks in Hyderabad: గంట సేపటి దాకా కుక్క బీభత్సం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాడికి తెగబడ్డ కుక్కను పిచ్చికుక్కగా గుర్తించిన కొందరు యువకులు కొట్టి చంపేశారు. కుక్కల దాడిలో గాయపడ్డ నలుగురిని స్థానికులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోనే కందుకూరు మండలం పరిధిలోని ఓ గ్రామంలో గురువారం రోజున నలుగురిపై కుక్కలు దాడిచేశాయి. కుక్కకాటుతో పీహెచ్‌సీలో చికిత్స పొందినట్లు వైద్యలు తెలిపారు.