తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - కొవిడ్ రిలీఫ్ ప్రాజెక్టు

లాక్​డౌన్​తో అనేక ఇబ్బందులు పడుతోన్న నిరుపేదలకు సాయంగా నిలిచేందుకు హైదరాబాద్​కు చెందిన కొంత మంది విద్యార్థులు ముందుకొచ్చారు. కష్ట కాలంలో ఆకలితో అలమటిస్తోన్న వారికి నిత్యావసరాలు పంపిణీ చేస్తూ సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవ చేయడం తమకెంతో సంతృప్తికరంగా ఉందంటున్నారు.

humanists
humanists

By

Published : Jun 4, 2021, 5:39 PM IST

హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంత మంది విద్యార్థులు 'స్ట్రీట్ కాజ్​​ వీజేఐటీ ఫీడ్ ది నీడ్' పేరిట ఓ బృందంగా ఏర్పడ్డారు. లాక్​డౌన్​తో ఉపాధి కరవై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొత్తపేటకు చెందిన 250 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలను పంపిణీ చేసి అండగా నిలిచారు.

సంస్థ నుంచి కొవిడ్ రిలీఫ్ ప్రాజెక్టులో భాగంగా రూ.లక్ష బడ్జెట్​తో దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంస్థ డివిజన్ ప్రెసిడెంట్ హరీశ్ వివరించారు. యువత.. విద్యార్థి దశ నుంచే సమాజం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపడతామని విద్యార్థులు తెలిపారు.

ఇదీ చదవండి:మూడో దశలో 25% మంది పిల్లలకు కరోనా వైరస్‌?

ABOUT THE AUTHOR

...view details