తెలంగాణ

telangana

మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేక అవార్డులతో సత్కారం

By

Published : Oct 29, 2020, 9:07 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని పార్క్​ప్లేస్​లో తెలంగాణ ఛాంబర్స్​ ఆఫ్​ ఈవెంట్స్​ ఇండస్ట్రీ, వీ క్లబ్​ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. విభిన్న రంగాలకు చెందిన మహిళా వ్యాపారవేత్తలకు స్త్రీ శక్తి, స్త్రీ మూర్తి, స్త్రీ రత్న అవార్డులతో సన్మానించారు.

stree shakthi award to women entrepreneurs at  hyderabad by v club
మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేక అవార్డులతో సత్కారం

విభిన్న రంగాలకు చెందిన మహిళా వ్యాపారవేత్తలను తెలంగాణ ఛాంబర్స్​ ఆఫ్​ ఈవెంట్స్​ ఇండస్ట్రీ, వీ క్లబ్​ సంయుక్తంగా సత్కరించారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని పార్క్​ ప్లేస్​లో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని... వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే అవార్డులు అందిస్తున్నట్టు తెలంగాణ ఛాంబర్స్​ ఆఫ్​ ఈవెంట్స్​ ఇండస్ట్రీ కార్యదర్శి రవి బుర్రా తెలిపారు.

మూడేళ్లుగా వివిధ రంగాలకు చెందిన మహిళలను గుర్తించి... స్త్రీ శక్తి, స్త్రీ మూర్తి, స్త్రీ రత్న అవార్డులతో సన్మానించారు. మహిళా వ్యాపారవేత్తలను గుర్తించి సత్కరించడం మరింత ఉత్సాహాన్నిస్తుందని గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details