లాక్డౌన్ను పటిష్టంగా అమలు పరుస్తున్న పోలీసులకు జనాలు హారతి ఇచ్చారు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో పోలీసులు చూపిస్తున్న తెగువ ఎంతో గొప్పదని సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ వాసులు అన్నారు. పోలీసుల పనితీరు విషయంలో ప్రజలు వారికి పుష్పాభిషేకం చేశారు.
పోలీసులకు హారతులు..పూలవర్షం - రెజిమెంటల్ బజార్ తాజా వార్తలు
కరోనా వైరస్ కట్టడిలో ఆంక్షలను పర్యవేక్షించేందుకు వచ్చిన పోలీసు అధికారులకు వింత అనుభవం ఎదురైంది. బస్తీ వాసులంతా వరుసలో నిలబడి పోలీసులకు హారతులు ఇస్తూ పుష్పాభిషేకం చేశారు. ఈ దృశ్యం సికింద్రాబాద్లో ఆవిష్కృతమైంది.
పోలీసులకు ఎదురైన వింత అనుభవం
భౌతిక దూరాన్ని పాటిస్తూ పోలీసులకు అభినందనలు తెలియజేశారు. తమ కుటుంబాలు, ప్రజల ప్రాణాలకు రక్షణగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న వారికి తోచిన విధంగా వారికి సన్మానం చేశారు.
ఇదీ చూడండి :నేడు భారతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం