తెలంగాణ

telangana

ETV Bharat / state

స్ట్రెయిన్ కలకలం... అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ - Telangana news

కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలను కరోనా కొత్తరకం స్ట్రెయిన్ కలవరపెడుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నట్లు ప్రకటించిన వైద్యారోగ్య శాఖ.. యూకే నుంచి ఇప్పటివరకు 1,200 మంది వచ్చినట్లు తెలిపింది.

స్ట్రెయిన్ కలకలం... అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ
స్ట్రెయిన్ కలకలం... అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ

By

Published : Dec 24, 2020, 6:55 AM IST

కరోనా కొత్త రకం స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు బ్రిటన్​ నుంచి రాష్ట్రానికి 1,200 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. కొత్త రకం కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించి... క్వారంటైన్​లో ఉంచుతున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 9 నుంచి యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎవరికి కరోనా పాజిటివ్ రాలేదని డీఎంహెచ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన వారు 040- 24651119 ఫోన్ 9154170960కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ విషయంలో ఆందోళన అవసరం లేదని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: రిపోర్టులు రాక.. విమానాశ్రయంలో పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details