తెలంగాణ

telangana

ETV Bharat / state

Pulichintala: ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు సందర్శకులకు అనుమతి నిషేధించారు. డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటును శుక్రవారానికి ఏర్పాటు చేస్తామని యంత్రాంగం చెప్పినా అది సాధ్యపడలేదు. అందుకు అవసరమైన ఏర్పాట్లలోనే యంత్రాంగం, బెన్‌కాం ప్రతినిధులు తలామునకలయ్యారు.

Pulichintala
పులిచింతల ప్రాజెక్టు

By

Published : Aug 7, 2021, 8:33 AM IST

పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు, ఇంజినీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు సందర్శకులకు అనుమతి నిషేధించారు.

డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటును శుక్రవారానికి ఏర్పాటు చేస్తామని యంత్రాంగం చెప్పినా అది సాధ్యపడలేదు. అందుకు అవసరమైన ఏర్పాట్లలోనే యంత్రాంగం, బెన్‌కాం ప్రతినిధులు తలామునకలయ్యారు. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు భారీగా పెరగడంతో జలాశయాన్ని ఖాళీ చేయించడం ఆలస్యమైంది. ఈ కారణంగానే తాత్కాలిక గేటు నిర్మాణ పనులు శుక్రవారం చేపట్టలేకపోయారు. జలాశయంలో నీటిమట్టం శుక్రవారం రాత్రికి 8 టీఎంసీల స్థాయికి చేరుకుంది. అయితే రాత్రి కావడంతో పనులు చేపట్టడం సాధ్యం కాదని భావించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే పనులు ప్రారంభించారు. సాధ్యమైనంత వరకూ స్టాప్‌లాక్‌ గేటు అమర్చాలని 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం సగటున 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపడంతో రాత్రికి జలాశయం అనుకున్న మేరకు ఖాళీ అయింది.

ప్రస్తుతం ప్రాజెక్టుకు లక్షా 8 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు 18గేట్లు ఎత్తి 2 లక్షల 79వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 5.38 టీఎంసీలుగా ఉంది. నీటి మట్టం 38.40 మీటర్లకు నీటి మట్టం తగ్గింది.

ఇదీ చదవండి:PULICHINTALA: ప్రాజెక్టు ఎంత భద్రమో సమగ్ర అధ్యయనమే మేలు

PULICHINTALA: స్టాప్​లాక్ అమర్చేందుకు ప్రయత్నాలు.. అందులోనూ అవరోధాలు

ABOUT THE AUTHOR

...view details