తెలంగాణ

telangana

ETV Bharat / state

pulichinthala project: స్టాప్ లాక్ ఏర్పాటుకు అధికారుల చర్యలు

ఏపీలోని పులిచింతల ప్రాజెక్ట్​లో స్టాప్ లాక్ ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. జలాశయంలో నీటిని దిగువకు వదిలే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 20 అడుగుల మేర నీరుంది.

pulichinthala project
పులిచింతల ప్రాజెక్ట్​

By

Published : Aug 6, 2021, 2:27 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిన ప్రాంతంలో స్టాప్‌ లాక్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. జలాశయంలో ఉన్న నీటిని దిగువకు వదిలి నీటిమట్టాన్ని తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి లక్షా 67 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. 19 గేట్లు ఎత్తి 4లక్షల 95వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

మరమ్మతు పనులు ప్రారంభించాలంటే మరో 10 టీఎంసీలు ఖాళీ చేయాల్సి ఉంది. మధ్యాహ్నం వరకూ 10 టీఎంసీలు దిగువకు విడుదల చేయోచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్టాప్‌ లాక్‌ ఏర్పాటుకు సంబంధించి నిపుణుల బృందం పులిచింతల ప్రాజెక్టుకు చేరుకుంది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు అవరసరమైన సరంజామాను సిద్ధం చేసుకున్నారు. కాసేపట్లో స్టాప్‌ లాక్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details