మూడురోజులపాటు టింబర్డిపోలు బంద్ వడ్రంగి కార్మికులపై అటవీ శాఖ అధికారుల వేధింపులకు నిరసనగా కలప వ్యాపారులు, సామిల్లర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలప డిపోలను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగినట్లు తెలిపింది. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 55 ను రద్దు చేయాలని నాంపల్లి కలెక్టరేట్లో జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ రవికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల 13న గవర్నర్ను కలిసి తమ సమస్యలు తెలుపుతామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.