తెలంగాణ

telangana

ETV Bharat / state

గులకరాళ్లతో నైవేద్యం.. గ్రామస్థుల వింత ఆచారం! - ananthapuram district latest news

గులకరాళ్లతో ఏం చేయొచ్చు..? పిల్లలైతే ఆడుకుంటారు. కాంట్రాక్టర్లైతే రోడ్లు వేస్తారు.! అవే రాళ్లను అక్కడి ప్రజలు దేవుడికి నైవేద్యంగా వేస్తున్నారు.! వినడానికి విడ్డూరంగా ఉందా..? అక్కడికెళ్లి చూస్తే కాస్త వింతగానూ ఉంటుంది. కానీ ఆ రాళ్ల వెనక ఓ పల్లె ప్రజల భక్తివిశ్వాసం దాగి ఉంది. అటో చూసొద్దాంరండి.

stones-offering-for-batta-baireshwara-swamy-temple-in-ananthapuram-district
గులకరాళ్లతో నైవేద్యం.. గ్రామస్థుల వింత ఆచారం!లకరాళ్లతో నైవేద్యం.. గ్రామస్థుల వింత ఆచారం!

By

Published : Apr 22, 2021, 7:56 AM IST

మామూలుగా ఆలయానికి వెళ్తే పళ్లు, పూలు, టెంకాయ తీసుకెళ్తాం. కానీ ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కోడిపల్లి పొలిమేరలోని బట్ట భైరవేశ్వర స్వామి భక్తులు మాత్రం ఫలపుష్పాలతోపాటు గులకరాళ్లూ తీసుకెళ్తారు. దానికి నిదర్శనమే ఆలయ పరిధిలో పోగుబడిన పెద్ద గులకరాళ్ల కుప్ప.

గులకరాళ్ల సమర్పణ...

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలంలో ఉంది కోడిపల్లి గ్రామం. ఆ ఊరి పొలిమేరలో వెలసిన బట్ట భైరవేశ్వర స్వామి అంటే చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో విశ్వాసం. ఊరుదాటి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు స్వామివారిని దర్శించుకుంటారు. అంతే కాదు ఐదు గులకరాళ్లు బట్టభైరవేశ్వరుడికి సమర్పిస్తారు. ఇలా చేస్తే సకల శుభాలూ కలుగుతాయని వారి విశ్వాసం.

అనాదిగా వస్తున్న ఆచారం...

పండగలరోజున ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఇలా వజ్రాల కోసం వెతికినట్లు గులకరాళ్ల కోసం భక్తులు అన్వేషిస్తారు. మనసులో గట్టి కోర్కెలు కోరుకుని స్వామివారిగుడి వద్ద ఉంచుతారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అంటున్నారు గ్రామస్థులు. అందుకే ఎన్నో ఏళ్లుగా నైవేద్యంగా సమర్పించిన రాళ్ల గుట్టను ఇప్పుడు కదిలించేందుకు ఎవరూ సాహరించరని చెప్తున్నారు. ఆ ఊరి ఆడపడుచులే కాదు కొత్తగా వచ్చిన కోడళ్లూ ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు.

ఇవీ చదవండి:ముల్లోకాలు మురిసేలా సీతారాముల కల్యాణ వేడుక

ABOUT THE AUTHOR

...view details