తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటిపై రాళ్ల దాడి.. 2014 నుంచి ఇది నాలుగోసారి: ఒవైసీ

attack on MIM chief Asaduddin Owaisi house: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటి నివాసంపై కొంతమంది దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఇలా జరగడం మొదటి సారి కాదని... 2014 నుంచి ఇది నాలుగోసారి అని ఎంపీ ఒవైసీ మండిపడ్డారు. వెంటనే దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Stone attack on MIM chief Asaduddin Owaisi house  in delhi
ఇంటిపై రాళ్ల దాడి.. 2014 నుంచి ఇది నాలుగోసారి: ఒవైసీ

By

Published : Feb 20, 2023, 3:42 PM IST

attack on MIM chief Asaduddin Owaisi house: దేశ రాజధాని దిల్లీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటి నివాసంపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒవైసీ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి నివాసం ముందు రాళ్లు రప్పలు పడి ఉన్నాయి. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ.. దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలనికి చేరుకున్న దిల్లీ పోలీసులు.. అక్కడి ప్రదేశాల్ని పరిశీలించారు. దాడి ఘటనపై అడిషనల్ డీసీపీ విచారణ చేపట్టారు. అక్కడి ప్రదేశాల్ని పరిశీలించి ఆనవాళ్లు సేకరించారు. ఎవరు చేశారో త్వరలో కనిపెడతామని ఒవైసీకి పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఒవైసీ కూడా తన ట్విటర్ ఖాతా వేదికగా స్పందించారు. తన నివాసంపై ఇలా దాడి జరగడం మొదటి సారి కాదని పేర్కొన్నారు. 2014 నుంచి ఇలా నాలుగు సార్లు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని ఆరోపించారు. రాజస్థాన్‌లోని జయపుర పర్యటనలో ఉన్న తాను ముగించుకుని వచ్చే సరికి కొంతమంది ఆగంతకులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆవేదన చెందారు.

ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ దాడి జరిగిందని.. ఇంట్లో పనిమనిషి చెప్పినట్లు పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ఇక ఇంటి చుట్టు పక్కన ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. వాటి ద్వారా నిందితులను త్వరగా పట్టుకోవాలని ఫిర్యాదులో చెప్పారు. అసదుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ చేపట్టారు.

ఇక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. రాజస్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ ఏడాది చివరల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎంఐఎం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక తెలంగాణలో ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏడు మంది శాసన సభ్యులు ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details