ఎండాకాలంలో మండే ఎండల సంగతి అటుంచి.. ఇప్పుడు మాత్రమే దొరికే మామిడిపండ్లను ఎంతో ఇష్టంగా ఆరగిస్తాం. మామిడిపండ్ల ముక్కలు, రసం వేటినీ వదిలిపెట్టం. కొందరు మామిడిపండును పెరుగన్నంలోనూ నంజుకుంటారు. మరికొందరైతే పండురసాన్ని పెరుగన్నంలో కలిపేసుకుంటారు. థాయ్‌లాండ్ వాసులు మాత్రం ప్రత్యేకంగా ‘మ్యాంగో స్టికీ రైస్’ను తయారుచేస్తారు. అక్కడ వేసవిలో వడ్డించే సంప్రదాయ వంటకమిది. ఇళ్లలోనే కాకుండా రెస్టారెంట్లలోనూ అందుబాటులో ఉంటుంది. అతిథులకు ఎంతో ఇష్టంగా దీన్ని వడ్డిస్తారు. ఒక్క థాయ్‌లాండ్‌లోనే కాకుండా ఇండోనేషియా, కంబోడియా, వియత్నాంలో కూడా చాలాఇష్టంగా ఈ వంటకాన్ని ఆరగిస్తారట. థాయ్ వంటకాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన దీన్ని ఎలా తయారుచేయాలంటే...
కావాల్సినవి: బియ్యం- కప్పు, మామిడిపండ్లు- రెండు, నీళ్లు- ఒకటిన్నర కప్పులు, బ్రౌన్ షుగర్- అయిదు టేబుల్ స్పూన్లు, ఉప్పు- తగినంత, చిక్కటి కొబ్బరిపాలు- ఆరు కప్పులు.