తెలంగాణ

telangana

ETV Bharat / state

Ktr Us Tour Updates : హైదరాబాద్​లో స్టెమ్​క్యూర్స్ 54 మిలియన్ డాలర్ల పెట్టుబడి - ktr america tour latest updates

Ktr Us Tour Updates : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో హైదరాబాద్​కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అమెరికాలోని దిగ్గజ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ స్టెమ్‌క్యూర్స్‌ సంస్థ హైదరాబాద్​లో తమ సేవలను విస్తరించడానికి సుముఖత చూపించింది. స్టెమ్ సెల్ థెరపీపై దృష్టి సారించే తయారీ ల్యాబ్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. అలాగే ప్లూమ్‌ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Stemcures and Plume Company Investments in Telangana
హైదరాబాద్​లో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుకొచ్చిన స్టెమ్​క్యూర్స్

By

Published : May 24, 2023, 8:36 PM IST

Updated : May 25, 2023, 2:00 PM IST

Stemcures and Plume Company Investments in Telangana : పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్​గా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సాగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అక్కడి సంస్థలతో చర్చలు జరుపుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారు. అలా కేటీఆర్ పర్యటనలో ఇటీవల పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పర్యటనలో వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేల ఉద్యోగ అవకాశాలు యువతకు అందనున్నాయి. ఇదివరకే అనేక సంస్థలు హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. తాజాగా అమెరికాలోని ప్రముఖ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ అయిన స్టెమ్‌క్యూర్స్‌ హైదరాబాద్‌లో స్టెమ్‌ సెల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అలాగే ప్లూమ్‌ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో తమ సేవలను విస్తరించనున్నారు.

Stemcures Investment in Hyderabad: అమెరికాలోని దిగ్గజ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ స్టెమ్‌క్యూర్స్‌ హైదరాబాద్‌లో స్టెమ్‌ సెల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అమెరికా ఆధారిత స్టెమ్‌క్యూర్స్ సంస్థ భారతదేశంలో అతిపెద్ద స్టెమ్ సెల్ తయారీ కర్మాగారాన్ని రూపొందించాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణలో ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Stemcures Investment in Telangana :ఈ సదుపాయం సుమారు 54 మిలియన్ డాలర్ల పెట్టుబడి సామర్థ్యంతో.. రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ల్యాబ్‌ ద్వారా సుమారు 150 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ స్టెమ్‌క్యూర్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ సాయిరామ్‌ అట్లూరిని కలిసి చర్చించారు. స్టెమ్‌క్యూర్స్‌ను హైదరాబాద్‌కు స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. స్టెమ్ సెల్ థెరపీ అనేది వివిధ రకాల పరిస్థితులకు ఒక ఆశాజనకమైన కొత్త చికిత్స అని.. భారతదేశంలోని రోగులకు స్టెమ్‌క్యూర్స్‌ అధిక నాణ్యత, సంరక్షణను అందిస్తుందని విశ్వసిస్తున్నానన్నారు.

Plume Company Investments in Hyderabad: కమ్యూనికేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌లో మెుట్టమెుదటి సాస్‌ ఎక్స్పీరియన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ప్లూమ్‌ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ఏర్పాటుతో దాదాపు 100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. హైదరాబాద్‌ నగరంలో తమ ఉనికిని చాటుకునే దిశగా సాగుతున్న తమ ప్రయాణంలో ఇది మెుట్టమెుదటి అడుగని సంస్థ ఛీఫ్‌ డెవెలప్మెంట్‌ ఆఫీసర్‌ కిరన్‌ ఎడార అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు తమ వంతు సహకారం అందించడానికి సంస్థ సిద్ధంగా ఉందన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2023, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details