విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో మొదలైన ఉద్యమం దిల్లీకి చేరింది. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా నిరసన చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు, కార్మిక సంఘాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల నేతలు కార్మిక సంఘాలకు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. కేంద్రం దిగివచ్చే వరకూ తమ నిరసనలు ఉద్ధృతంగా సాగుతూనే ఉంటాయని తేల్చిచెప్పారు. కేంద్రం మోసపూరిత మాటలను కట్టిపెట్టి..... విశాఖ ఉక్కు కర్మాగారంపై వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు
vishakha steel plant: దేశ రాజధానిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం - విశాఖ ఉక్కు ఉద్యమం
విశాఖ ఉక్కు నినాదం దేశరాజధానికి చేరింది. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా నిరసన చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు, కార్మిక సంఘాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నారు.
delhi
ఇవాళ జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు.. రేపు ఆంధ్రాభవన్‌లో మహానిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. కార్మిక సంఘాల నిరసనకు వైకాపా, తెదేపా, వామపక్షాలు సహా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
ఇదీ చూడండి:VISAKHA STEEL FIGHT: విశాఖ ఉక్కు పోరు.. హస్తినలో కార్మికుల నిరసన హోరు