తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవుల పరిరక్షణకు రూ. 603 కోట్లు! - పరిహార అటవీ నిర్మూలన కార్యక్రమాలపై సీఎస్​ను కలిసిన స్టీయరింగ్​ కమిటీ

పరిహార అటవీ నిర్మూలన కార్యక్రమాలను నిర్వహించడానికి 6వ స్టీరింగ్ కమిటీ ఈ ఏడాదికి గానూ రూ. 603 కోట్ల రూపొందించిన వార్షిక ప్రణాళికకు ఆమోద ముద్ర వేసింది. బీఆర్కే భవన్​లో సీఎస్​ సోమేశ్​కుమార్​ అధ్యక్షతన పలువురు అధికారులు సమావేశమయ్యారు.

stearing committee meeting with cs somesh kumar on Compensatory Afforestation programs
పరిహార అటవీ నిర్మూలన కార్యక్రమానికి రూ. 603 కోట్లు..!

By

Published : Jun 10, 2020, 4:07 PM IST

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సర పరిహార అటవీ నిర్మూలన కార్యక్రమాలను నిర్వహించడానికి స్టీరింగ్ కమిటీ రూ. 603 కోట్లతో వార్షిక ప్రణాళికను ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ నేతృత్వంలో బీఆర్కే భవన్​లో 6వ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. పరిహార అటవీ నిర్మూలన(సీఏ), పరివాహక ఏరియా చికిత్స(సీఏటీ), ఇంటిగ్రేటెడ్ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (ఐడబ్యూఎల్​ఎం), నికర ప్రస్తుత విలువ (ఎన్​పీవీ) క్యాటగిరీల క్రింద వివిధ పనులు చేపట్టడానికి స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని సోమేష్‌కుమార్ తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, పీసీసీఎఫ్ శోభ, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details