సచివాలయ కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు అవసరమా.. లేదా..? - తెలంగాణ తాజా వార్తలు
12:59 July 16
రేపటిలోగా స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
సచివాలయం భవనాల కూల్చివేతలపై హైకోర్టు రేపటి వరకు స్టే పొడిగించింది. కూల్చివేతలకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా? అని ప్రశ్నించింది. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడమంటే ఏమిటని వ్యాఖ్యానించింది. పాత భవనాలు కూల్చడమంటే కొత్త నిర్మాణానికి సిద్ధం చేయడమే కదా అని పేర్కొంది.
పీసీబీ, రాష్ట్రస్థాయి పర్యావరణ మదింపు అథారిటీ నివేదికలపై హైకోర్టు అసంతృప్తి చేసింది. సూటిగా సమాధానం ఇవ్వకుండా తెలివిగా నివేదికలు ఇచ్చారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి సమాచారం రాలేదన్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్.... సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. రేపటిలోగా స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వ స్పష్టతే కీలకమని వ్యాఖ్యానిస్తూ... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.