ఒకరేమో మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించిన రూపకర్త పింగళి వెంకయ్య, మరొకరు నిత్యం పాఠశాలల్లో విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ అనువదించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు వీరిద్దరూ భారతావని గర్వించ దగ్గ మహోన్నత జాతీయ శిఖరాలని పింగళి వెంకయ్య మనవరాలు పింగళి స్వాతి అన్నారు. సికింద్రాబాద్ వీరమాచినేని పగడయ్య పాఠశాలలో తెలుగు తేజోమూర్తుల విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. దేశ ప్రగతిని సాధించే విజయాలకు చిహ్నంగా ఉండేది జాతీయ పతాకమని ఆ జాతీయ పతాకాన్ని తయారుచేసిన పింగళి కుటుంబ వారసులం అయినందుకు ఆనందంగా ఉందన్నారు.
తెలుగు తేజోమూర్తుల విగ్రహావిష్కరణ సభ - pingali venkaiah
సికింద్రాబాద్ వీరమాచినేని పగడయ్య పాఠశాలలో తెలుగు తేజోమూర్తులు పింగళి వెంకయ్య, పైడిమర్రి వెంకట సుబ్బారావు విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పింగళి వెంకయ్య, పైడిమర్రి వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తెలుగు తేజోమూర్తుల విగ్రహావిష్కరణ సభ