లాక్డౌన్ వల్ల కుదేలైన చేనేత వృత్తులను అదుకొని.. కరోనా భృతిగా రూ. 20వేలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ స్పందించాలి..
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్య సూచన మేరకు.. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. చిన్నచిన్న సమస్యలకే ట్విటర్ ద్వారా స్పందించే మంత్రి కేటీఆర్.. నేతన్నల చావులపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.