'స్వయం సమృద్ధి వర్షాలతోనే రాష్ట్రం సుభిక్షం' - STATE WIDE RAINS
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాంకాళి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి అన్నదాతలకు అండగా నిలవాలని స్థానిక కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ వరుణుడిని ప్రార్థించారు.

వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో రాష్టం సుభిక్షంగా ఉండాలని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వరుణ యాగాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాంకాళి ఆలయంలో " వరుణ జప సహిత రుద్ర వరుణ యాగం" హోమాన్ని వేద పండితులు జరిపించారు.
రాష్ట్రమంతటా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్లు అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అన్నదాతలకు వరుణుడు అండగా నిలవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు భారీ వర్షాలతో నిండు కుండలా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అన్నపూర్ణ పాల్గొన్నారు.