తెలంగాణ

telangana

ETV Bharat / state

సోనియాకు భాజపా నాయకులు క్షమాపణ చెప్పాలి: నేరళ్ల శారద - సోనియా గాంధీ తాజా వార్తలు

సోనియా గాంధీని ఉద్దేశించి భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు నేరెళ్ల శారద తప్పుబట్టారు. భాజపా నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

భాజపా నాయకులు క్షమాపణ చెప్పాలి: నేరళ్ల శారద

By

Published : Oct 16, 2019, 3:34 PM IST

భాజపా నాయకులు క్షమాపణ చెప్పాలి: నేరళ్ల శారద

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హరియణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద నేతృత్వంలో గాంధీభవన్‌లో మనోహర్‌ లాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలను అవమాన పరచడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ఉందని ఆరోపించారు. సోనియా గాంధీకి ఏఐసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం కొండను తవ్వి... చచ్చిన ఎలుకను బయటకు తీసినట్టుందని వ్యాఖ్యలు చేయడం దారుణమన్న ఆమె... బీజేపీకి మహిళా నేతల పట్ల చులకన భావన ఉందని ఆరోపించారు. ప్రపంచంలో శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందిన సోనియా గాంధీ పట్ల ఇలా మాట్లాడడం మూర్కత్వానికి అద్దం పడుతోందన్న ఆమె వెంటనే బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details