తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై షీ టీమ్స్​కు రాష్ట్ర స్థాయి బృందం: స్వాతి లక్రా - ఇకపై షీ టీమ్స్​కు రాష్ట్ర స్థాయి బృందం... స్వాతి లక్రా

మహిళల భద్రతే లక్ష్యంగా ఏర్పాటైన షీటీమ్స్​ కోసం రాష్ట్ర స్థాయిలో ఓ ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దీనికి సంబంధించిన విధి విధానాలను షీ టీమ్స్ రాష్ట్ర ఇంఛార్జీ ఐజీ స్వాతి లక్రా వివరించారు.

షీటీమ్, డయల్ 100, హాక్-ఐ అప్లికేషన్లపై మహిళలకు అవగాహన
షీటీమ్, డయల్ 100, హాక్-ఐ అప్లికేషన్లపై మహిళలకు అవగాహన

By

Published : Dec 20, 2019, 6:19 AM IST

Updated : Dec 20, 2019, 7:26 AM IST

షీ టీమ్​లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళా భద్రతా విభాగం రాష్ట్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన విధి విధానాలను ఐజీ స్వాతి లక్రా వెల్లడించారు. ఈ ప్రత్యేక బృందాన్ని షీటీమ్ రాష్ట్ర బాధ్యురాలు స్వాతి లక్రా పర్యవేక్షించనున్నారు. షీటీమ్, డయల్ 100, హాక్-ఐ అప్లికేషన్లపై మహిళలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు.

అన్ని జిల్లాల్లోని మహిళా కళాశాలల్లో సైబర్ నేరాలపై షీ టీమ్స్ అవగాహన కల్పించనున్నాయి. మహిళా సంఘాలకు ఆత్మరక్షణ వంటి విద్యను నేర్పించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు షీ టీమ్స్​పై అవగాహన కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బృందం స్త్రీల భద్రతా కార్యక్రమాలను నిర్వహించనుంది.

షీటీమ్, డయల్ 100, హాక్-ఐ అప్లికేషన్లపై మహిళలకు అవగాహన

ఇవీ చూడండి : మద్యపాన నిషేధానికి గ్రామ మహిళలు తీర్మానం

Last Updated : Dec 20, 2019, 7:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details