కొంత కాలంగా రాష్ట్రంలో హాకీ అసోసియేషన్‌లో నెలకొన్న పరిణామాలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి. రవీంద్ర భారతీలో మంత్రి కార్యాలయంలో వివిధ జిల్లాల హాకీ అసోసియేషన్ కార్యదర్శులు, మాజీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులతో కలిసి ఛైర్మన్ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర హాకీ అసోసియేషన్ పేరుకు మాత్రమే ఉందని... పది ఏళ్లుగా ఒక్క తెలంగాణ హాకీ లీగ్ జరపలేదని మంత్రికి వివరించారు. అసోసియేషన్‌లో కొంత మంది వ్యాపార వేత్తలు క్రీడలతో సంబంధం లేకుండా... వ్యాపార ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో హాకీ క్రీడ కుంటుపడి పోతుందని శ్రీనివాస్ గౌడ్‌కు తెలిపారు.