తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎంఆర్​ఎఫ్​కు సీడ్స్‌మెన్‌ అసోషియేషన్ రూ.3 కోట్ల విరాళం - Ministers niranjanreddy and Ktr

కరోనా నియంత్రణకు సీఎం సహాయనిధికి రాష్ట్ర సీడ్స్​మెన్ అసోసియేషన్ సుమారు మూడు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు నిధులను రాష్ట్ర మంత్రులు నిరంజన్​రెడ్డి, కేటీఆర్​కు అందజేశారు.

సీడ్స్‌మెన్‌ అసోషియేషన్ రూ.3 కోట్ల విరాళం
సీడ్స్‌మెన్‌ అసోషియేషన్ రూ.3 కోట్ల విరాళం

By

Published : May 7, 2020, 9:24 PM IST

కరోనా నివారణకు సీఎం సహాయనిధికి రాష్ట్ర సీడ్స్‌మెన్‌ అసోసియేషన్ 3 కోట్లు రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఇందులో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి 1.16 కోట్ల చెక్కు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు 1.70 కోట్ల చెక్కును సీడ్స్‌మెన్‌ అసోషియేషన్ తరఫున అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు ఏఎస్‌ఎన్ రెడ్డి అందజేశారు.

త్వరలోనే రూ.14లక్షలు...

మిగతా 14 లక్షలు వివిధ జిల్లాల నుంచి రాగానే అందజేస్తామని వివరించారు. ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన సీడ్స్‌మెన్ అసోసియేషన్​ను మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో అసోషియేషన్‌ సభ్యులు ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details