తెలంగాణ

telangana

ETV Bharat / state

'జన అదాలత్'తో ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం - జన అదాలత్ గోడ పత్రికను ఆవిష్కరణ

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని పరిశ్రమ భవన్ లోని కమిషన్ కార్యాలయంలో జన అదాలత్ గోడ పత్రికను ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణకై జన అదాలత్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

SC,ST Commission Chairman launched the Jana Adalat wall poster
జన అదాలత్ గోడ పత్రిక ఆవిష్కరించిన ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఛైర్మన్

By

Published : Nov 18, 2020, 3:42 PM IST

దళిత ,గిరిజనుల హక్కుల పరిరక్షణకై జన అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని పరిశ్రమ భవన్ లోని కమిషన్ కార్యాలయంలో ఆయన జన అదాలత్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల వరుసగా 19, 20, 21న ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కోర్టు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులకు అక్కడే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.

హైదరాబాద్ వరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోలేని బాధితుల కోసం కమిషనే వారి వద్దకు వెళ్లి సత్వర న్యాయం చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వెనుకబడిన వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ద్వారా తెలంగాణలోని ప్రతి జిల్లాలో పెండింగ్ కేసులను జన అదాలత్ విచారించి.. పరిష్కరిస్తుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు.

ఇవీ చదవండి: కేంద్ర మాజీమంత్రి స్థలంలో అపశ్రుతి..

ABOUT THE AUTHOR

...view details