ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ సర్పంచుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సర్పంచులు తమ హక్కుల కోసం చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకే... తమ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిందని సంఘం నాయకులు ఆరోపించారు. 22 రోజుల ఆనంతరం జైలు నుంచి విడుదలైన భూమన్న యాదవ్‌ను హైదరాబాద్‌లోని నివాసంలో కలిసి అభినందించారు. ఆర్టీసీకి, గ్రామీణ ప్రాంత ప్రజలకు అవినాభావ సంబంధం ఉందని... సమ్మె వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నిజామాబాద్‌లో రైతుల నామినేషన్ల వల్లే కవిత ఒడిపోయిందని... హుజూర్‌నగర్‌లో సర్పంచుల నామినేషన్లకు సీఎం భయపడ్డారన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సర్పంచుల సంఘం మద్దతు - తెలంగాణ సర్పంచుల సంఘం
22 రోజుల తర్వాల జైలు నుంచి విడుదలైన తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ను ఆ సంఘం నాయకులు కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సర్పంచుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
STATE SARPUNCHE UNION SUPPORTS TSRTC STRIKE