రాష్ట్రంలో కరీంనగర్ లేదా వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన శాటిలైట్ షిప్ లేదా ఆఫ్ క్యాంపస్ వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు ఓ లేఖ రాశారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యాపరంగా చేయూత అందించాల్సిన గురుతర బాధ్యత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉపకులపతికి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం 1969లో ప్రారంభమైన తొలిదశ తెలంగాణ పోరాట నేపథ్యంలో ఉద్యమ జ్వాలలు చల్లార్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (ఈ) అనుసరించి 1973లో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.