తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరులకు నివాళి

పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దుశ్చర్యలపై రాష్ట్ర ప్రజలు మండిపడ్డారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు.

By

Published : Feb 17, 2019, 6:00 AM IST

Updated : Feb 17, 2019, 8:11 AM IST

జోహార్ జవాన్

జోహార్ జవాన్
పుల్వామాలో అమరులైన జవాన్లకు రాష్ట్ర ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టి సంతాపం తెలుపుతున్నారు. పాక్​ చర్యలను తిప్పికొట్టాలని డిమాండ్​ చేశారు. ప్రతి దాడి నిర్వహించడానికి ఆర్మీకి దేశ ప్రజల మద్దతు ఉంటుందన్నారు.

భారత సైనికులపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభివర్ణించారు. అమరులకు సంఘీభావంగా హైదరాబాద్​ కేబీఆర్ పార్క్​ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జవాన్ల త్యాగాలు మరువలేనివని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ కొనియాడారు.

ముష్కరుల దాడికి నిరసనగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్‌ చౌరస్తాలో బీఎంస్​ ఆధ్వర్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కూకట్‌పల్లి న్యాయమూర్తి, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది.... కొవ్వొత్తులు వెలిగించి అమరులకు నివాళులు అర్పించారు. దాడిని నిరసిస్తూ... చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధ్యాయులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మంచిర్యాలలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. జవాన్లపై ఉగ్ర దాడిని ఖండిస్తూ.... జగిత్యాలలో ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. సైనికులను దొంగ చాటుగా దెబ్బ తీసిన ఉగ్రవాదులను మట్టుబెట్టాలంటూ వరంగల్ నగరవాసులు ర్యాలీ చేపట్టారు.

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాల్లో పలు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 80 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు.

Last Updated : Feb 17, 2019, 8:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details