తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాణ్యమైన విద్య వల్లే... బంగారు తెలంగాణ సాధ్యం' - state mother association Convener Bhagya lakshmi

సంక్షేమ పథకాల వల్ల బంగారు తెలంగాణ సాధ్యం కాదని... విద్యా సామర్థ్యాలు పెంచడం వల్ల అది సాధ్యమవుతుందని రాష్ట్ర మదర్స్​ అసోసియేషన్ పేర్కొంది. పిల్లలకు నాణ్యమైన విద్యా సామర్థ్యాలు అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.

'నాణ్యమైన విద్య వల్లే... బంగారు తెలంగాణ సాధ్యం'

By

Published : Nov 21, 2019, 9:00 PM IST

హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో మదర్స్​ అసోసియేషన్ హైద్రాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లల్లో నాణ్యమైన విద్యా సామర్థ్యాల సమస్య ఏర్పడిందని అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి ఆరోపించారు. ఈ సమస్య ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కాదని... ప్రైవేట్ స్కూల్లో కూడా ఉందని స్పష్టం చేశారు.

తమ కమిటీ ద్వారా బస్తీలలో ఉన్న పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించామని.. మూడింట రెండొంతుల మంది పిల్లల్లో వ్యత్యాసాలను గుర్తించినట్లు భాగ్యలక్ష్మీ పేర్కొన్నారు. ఈ విషయాలపై అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన ప్రయోజనం లేదన్నారు. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'నాణ్యమైన విద్య వల్లే... బంగారు తెలంగాణ సాధ్యం'

ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details