భారతీయ జనతా పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 4వ డివిజన్ మీర్పేట్ తెరాస అభ్యర్థి ప్రభుదాస్‌ను గెలిపించినందుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
భాజపాకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు: మంత్రి ఎర్రబెల్లి - తెలంగాణ వార్తలు
సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తోన్న భాజపాపై ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు .గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 4వ డివిజన్ తెరాస అభ్యర్థి గెలిపించినందుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
భాజపాకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న కృషిని చూసే తాను తెరాసలో చేరానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోన్న భాజపాపై ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. కేంద్రంతో వివాదం పెట్టుకుంటే రాష్ట్రానికి రావలసిన నిధులను ఆపేస్తోందని మండిపడ్డారు. డివిజన్ ప్రజలకు ఇచ్చిన హామీలను, సమస్యలను నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఇదీ చదవండి:బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. అనుమానాలు లేవన్న కుటుంబం!