తెలంగాణ

telangana

ETV Bharat / state

జర్నలిస్టులారా.. జాగ్రత్తలు తీసుకోండి : అల్లం నారాయణ - అల్లం నారాయణ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ముందు తమ ప్రాణాలు కాపాడుకుంటూనే ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలని ఆయన సూచించారు.

'జర్నలిస్టులు కుటుంబ సంరక్షణనూ దృష్టిలో ఉంచుకోవాలి'
'జర్నలిస్టులు కుటుంబ సంరక్షణనూ దృష్టిలో ఉంచుకోవాలి'

By

Published : May 2, 2020, 11:43 PM IST

కరోనా మహమ్మారి బారినపడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు సమాజహితం కోసం పనిచేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలన్నారు. ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదన్నారు. జర్నలిస్టులు భౌతిక దూరం పాటిస్తూ... శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

కుటుంబీకులే ముందు...

సమాజం కన్నా ముందు మనపై ఆధారపడిన కుటుంబీకుల బాగోగులను జర్నలిస్టులు గుర్తించాలన్నారు. శనివారం దిల్లీలో కరోనా బారిన పడిన జర్నలిస్టుల కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు వారితో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, ఖర్చుల నిమిత్తం వెంటనే 20 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు వివరించారు. గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లోని క్వారంటైన్​లో ఉన్న జర్నలిస్టులకు కూడా 10 వేల రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి : దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,411 మందికి వైరస్

ABOUT THE AUTHOR

...view details