తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్తంగా ఈనెల 1వ తేదీనుంచి 13వ వరకు రాష్ట్రస్థాయి బాలల వర్చువల్ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో రాష్ట్రస్థాయిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఆకట్టుకుంటున్న రాష్ట్రస్థాయి వర్చువల్ నాటకోత్సవాలు - బాలల వర్చువల్ నాటకోత్సవాలు
కరోనా వైరస్ కారణంగా ఇళ్ల కే పరిమితమైన చిన్నారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపి వారిలో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్తంగా ఈనెల 1నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాలల వర్చువల్ నాటకోత్సవాలు ఆకట్టుకుంటున్నాయి.
ఆకట్టుకుంటున్న రాష్ట్రస్థాయి వర్చువల్ నాటకోత్సవాలు
కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. వారికి మానసిక ఉల్లాసంతో పాటు ఉత్సాహం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం అని అభినయ థియేటర్స్ ట్రస్ట్ అభినయ శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి:పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుంది: హైకోర్టు