ప్రజలెవరూ బయటకు రావొద్దని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. నిత్యవసర వస్తువుల వాహనాలు ఎక్కడా ఆపడం లేదన్నారు. రాష్ట్ర పోలీసులు చాలా సేవ చేస్తున్నారని.. ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పాటుపడుతున్నారని మహమూద్ అలీ వివరించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌తో సమావేశమైన హోంమంత్రి మహమూద్ అలీ కమిషనరేటర్ పరిధిలో ఉన్న పరిస్థితిపై సమీక్షించారు.
సమష్టిగా ముందుకెళదాం.. కరోనాను తరిమికొడదాం: హోంమంత్రి
ప్రజలందరూ బయటకు రావొద్దని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజల కోసమే ఉందని.. ఇలా కొన్ని రోజులు పాటిస్తే కరోనాను అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వాలంటరీగా భోజనం అందించేవారికి పాసులు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్.. పరిస్థితిని మానిటర్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇలా కొన్ని రోజులు పాటిస్తే కరోనాను పారదోలవచ్చు: హోంమంత్రి
ఇంటికి ఒక్క మనిషి మాత్రమే వచ్చి అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకోవాలని హోంమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితిని మానిటర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల కోసమే ఉందని.. ఇలా కొన్నిరోజులు పాటిస్తే కరోనాను పారదోలగలమన్నారు. వాలంటరీగా కొందరు భోజనం అందిస్తున్నారని వారికి పాసులు అందిస్తామన్నారు. అలాగే మీడియాకు కూడా పాసులు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మహమూద్ అలీ వెల్లడించారు.
ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము