వరంగల్‌లో జరిగిన తొమ్మిది మంది హత్య కేసును కేవలం మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అభినందించారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసును మూడు రోజుల్లోనే ఛేదించి.. నిందితుడిని పట్టుకున్న వరంగల్ కమిషనర్ రవీందర్‌ను హోం మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
వరంగల్ పోలీసులను అభినందించిన హోంమంత్రి - తొమ్మిది మందిని చంపిన కిరాతకుడు
వరంగల్‌లో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులను హోం మంత్రి మహమూద్ అలీ అభినందించారు. సంచలనం సృష్టించిన హత్య కేసుకు సంబంధించిన నిందితుడిని మూడు రోజుల్లోనే పట్టుకోవడం పట్ల హోంమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
![వరంగల్ పోలీసులను అభినందించిన హోంమంత్రి State Home minister Appreciate Warangal Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7345101-1106-7345101-1590424520677.jpg)
వరంగల్ పోలీసులను అభినందించిన హోంమంత్రి
పకడ్బందీగా దర్యాప్తు చేసి.. కేసు ఛేదించాలని రెండు రోజుల క్రితం కమిషనర్ రవీందర్‌కు హోంమంత్రి సూచించారు. మిస్టరీని ఛేదించేందుకు కష్టపడిన పోలీసులను పేరుపేరున ప్రశంసించినట్టు హోంమంత్రి తెలిపారు.
ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు