కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు - ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు
నీరా పాలసీ ప్రకటించినందుకు రాష్ట్ర గౌడ సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ నెల 4న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లను సన్మానిస్తున్నట్లు వెల్లడించింది.
![కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు State Gowda community thanks Chief Minister KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5573436-978-5573436-1577974250125.jpg)
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌడ కులస్థుల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర గౌడ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఉమ్మడి పాలనలో గౌడ కులస్థులు అనేక కష్టాలు పడ్డారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మారాయని చెప్పారు. ఇటీవల నీరా విధానాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతగా... ఈ నెల 4న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు గౌడ్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు