1నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రమోట్ - 1 to 9th class student promoted without exams
17:36 April 26
1నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రమోట్
రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ రాష్ట్ర ప్రభుత్వం పైతరగతులకు ప్రమోట్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. విద్యాసంస్థలకు రేపట్నుంచి మే నెలాఖరు వరకు వేసవి సెలవులను కూడా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ 2021-22 విద్యాసంవత్సరంలో పైతరగతులు చదివేలా ప్రమోట్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి :'కేసీఆర్ ఖాళీ పోస్టులు నింపు జర...చావులు కొంతమేరకైనా ఆపొచ్చు'