రాష్ట్ర పశుసంవర్థక శాఖలో కొంత కాలంగా ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న 75 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల సేవల కాలం సర్కారు మరో సంవత్సరం పొడిగించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
ఒప్పంద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు మరోసారి అవకాశం - State Veterinary Department latest updates
పశుసంవర్థక శాఖలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న 75 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో వారి సేవలు వినియోగించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది.
Hyderabad latest news
గత ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31వ తేదీ వరకు 12 మాసాలపాటు వీరు ఆయా పోస్టుల్లో కొనసాగుతున్న తరుణంలో తాజా ప్రకటనపై ఒప్పంద వీఏఎస్‌ల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వీరంతా పశుసంవర్థక శాఖ సంచాలకుల డైరెక్టరేట్ పరిధిలో పనిచేస్తున్నారు. తాజాగా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు మళ్లీ కొత్తగా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పత్రాలు పొందనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇవీ చూడండి:సర్కారుపై హైకోర్టు సీరియస్