Govt on Loans: రుణాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు సర్కార్ ఇప్పటికే వివరణ ఇచ్చింది. వివరణతో పాటు రుణాలకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ అడిగిన వివరాలు, సమాచారాన్ని కూడా పంపారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఇటీవల చెప్పారు. నివేదిక పంపిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ అధికారులను కలిసి రాష్ట్ర ప్రభుత్వ వాదన వినిపిస్తారు. కేంద్రం స్పందనకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రాలు తీసుకునే అప్పులపై ఆంక్షలను ఎత్తివేయాలని, బాండ్ల విక్రయం కోసం రుణానికి అనుమతించాలని ఆ లేఖలో పేర్కొంది. కేంద్ర నిర్ణయాల వల్ల అభివృద్ధి, సంక్షేమాలకు విఘాతం కలుగుతుందని వివరించింది.
రుణాల విషయంపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కారు.. - ts news
Govt on Loans: రుణాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు సర్కార్ ఇప్పటికే వివరణ ఇచ్చింది. వివరణతో పాటు రుణాలకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ అడిగిన వివరాలు, సమాచారాన్ని కూడా పంపారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఇటీవల చెప్పారు. నివేదిక పంపిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు.
![రుణాల విషయంపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కారు.. రుణాల విషయంపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కారు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15324278-137-15324278-1652914410828.jpg)
రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్రం ఆంక్షలకు పూనుకోవడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలని ఆయన నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాసనసభను సమావేశపరిచి రుణ ఆంక్షలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే తాను స్వయంగా హస్తిన వెళ్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి సమావేశం సందర్భంగా సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించారు. అవసమైతే శుక్రవారం తానే దిల్లీ వెళ్తానని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. కేంద్రం నుంచి ప్రతికూల స్పందన వస్తే అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు చెప్తున్నారు. అదే జరిగి, అటువంటి పరిస్థితులు తలెత్తితే కేంద్ర ప్రభుత్వ వైఖరిని అన్ని విధాలుగా ఎండగట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అవసరమైతే శాసనసభను కూడా సమావేశపరచి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించి తీర్మానం చేయాలన్న యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కొంత మంది మంత్రులు, నేతలతో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్తున్నారు.
ఇవీ చదవండి: