తెలంగాణ

telangana

ETV Bharat / state

Old Age Pensions: 57 ఏళ్లు నిండిన వారికి గుడ్​న్యూస్ చెప్పిన ప్రభుత్వం - applications for new Old Age Pensions

Old Age Pensions
Old Age Pensions

By

Published : Oct 9, 2021, 8:35 PM IST

Updated : Oct 9, 2021, 10:00 PM IST

20:31 October 09

కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ

కొత్త వృద్ధాప్య పింఛన్ల (Old Age Pensions) మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరించనున్నారు. 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు తీసుకోనున్నారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

2019 నుంచి నిలిచిన ప్రక్రియ...

రాష్ట్రంలో 2019 జులై నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. తెరాస ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆసరా పింఛన్లను రూ. వెయ్యికి, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ. 2 వేలకు పెంచింది. ఏ ఆధారంలేని నిరుపేద అర్హులు ఫించన్లతోనైనా బతకవచ్చనే ఆనందం వ్యక్తం చేశారు. తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రూ. వెయ్యిగా పింఛన్​ను 2016 రూపాయలకు, 2 వేలను 3016 రూపాయలకు పెంచడంతో అర్హుల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ వృద్ధాప్య పిఛన్లకు 65 ఏళ్లు వయసు ఉండాలని ప్రభుత్వ చెప్పడంతో చాలామందికి పింఛన్ వర్తించకుండా పోయింది.

అనర్హులు ఎవరంటే?

దరఖాస్తుదారు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణప్రాంతాల్లో రూ.2 లక్షలు మించొద్ధు. దరఖాస్తుదారు పేరిట మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 5 ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబంలో ఇది వరకే పింఛను పొందుతుంటే మరొకరు అనర్హులుగా తేల్చుతారు. విచారణ సమయంలో ఇవన్నీ చూశాకే అర్హులను గుర్తిస్తారు. ఆ తర్వాతే పింఛను మంజూరవుతుంది.

దరఖాస్తు ఇలా..

ఈ నెల 31తో 57 ఏళ్లు నిండిన వారంతా వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు. సంబంధీకులు దగ్గరలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి తగు ఆధారాలతో దరఖాస్తు చేయాలి. వయసు నిర్ధరణకు పంచాయతీ, మున్సిపల్‌ జారీ చేసిన జనన ధ్రువీకరణపత్రాలు లేదా గతంలో చదివిన విద్యాసంస్థలు జారీచేసిన పత్రాలు, లేదంటే ఓటరు గుర్తింపుకార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపించాలి. దరఖాస్తుకు ఆధార్‌కార్డు, వయసు నిర్ధరణ పత్రంతో పాటు బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోతో స్వయంగా దరఖాస్తుదారు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: HYDERABAD RAIN ALERT: హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దు: జీహెచ్​ఎంసీ

Last Updated : Oct 9, 2021, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details