ప్రైవేటు ల్యాబుల్లో చేస్తున్న కరోనా పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం.. ఓ ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో సుమారు 71.7 శాతం మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. సదరు ల్యాబ్‌లో 3,726 నమూనాలను పరీక్షించగా 2,672 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. ప్రైవేటు ల్యాబ్ ఫలితాలను మరోసారి వైద్యారోగ్య శాఖ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో సదరు ల్యాబ్ చేసిన పరీక్షల ఫలితాలను నిపుణుల కమిటీ పరిశీలించే వరకు ఆ గణాంకాలను పరిగణలోకి తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానం - corona tests in private labs in telangana
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. సదరు ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో 71.7 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో ఆ గణాంకాలను పరిగణనలోకి తీసుకోబోమని సర్కారు స్పష్టం చేసింది.
కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అననుమానం
Last Updated : Jul 4, 2020, 6:19 AM IST