రాష్ట్రంలో కొవిడ్ మళ్లీ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. కొత్తగా 59వేల 343 మందికి పరీక్షలు నిర్వహించగా... 965 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. మరో ఐదుగురు మహమ్మారికి బలికాగా... మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 1,706కు చేరింది. 312 మంది వైరస్ నుంచి కోలుకోగా... ప్రస్తుతం 6,159 క్రియాశీల కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
కొత్త కేసుల్లో దాదాపు సగం జీహెచ్ఎంసీ దాని చుట్టుపక్కల జిల్లాల్లోనే వెలుగుచూశాయి. బల్దియా పరిధిలో 254 మంది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 110, రంగారెడ్డి జిల్లాలో 97 మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 64 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. జగిత్యాల జిల్లాలో 35, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో 29 చొప్పున వైరస్ బారిన పడ్డారు.