తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2020, 4:21 PM IST

ETV Bharat / state

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుపై.. రైతుసంఘం నిరసన

పెట్రోల్​, డీజిల్​ ధరల పెరుగుదల సామాన్యుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, సరుకు రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి.. పేదవాడిపై అదనపు భారం మోపుతున్నారని రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్​ అన్నారు. పెట్రోల్​, డీజిల్​ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేశారు.

State Formers Union Oppose Petrol, Diesel Price Hike
పెట్రోల్​, డీజిల్​ ధరలపై.. రైతుసంఘం నిరసన

పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలు పేదోడిపై అదనపు భారాన్ని మోపుతున్నాయని రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సరుకు రవాణా ఛార్జీలు పెరిగి.. నిత్యావసరాల ధరలు పెరిగి..పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్​ అన్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, కూలీల తరలింపు ఖర్చులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని సాగర్ డిమాండ్ చేశారు. లాక్​డౌన్​తో ఉపాధి లేక పేద, మధ్య తరగతి కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా సాగుతున్న క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాళ్ల జీవితాలను మరింత ఛిద్రం చేస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. పాలు,కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ కోరారు.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్​!

ABOUT THE AUTHOR

...view details