రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్, శాసనసభ, శాసనమండలి తదితర భవనాలను విద్యుత్ వెలుగులతో కనువిందు చేస్తున్నాయి.
Formation Day: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. విద్యుత్ కాంతుల్లో ప్రధాన కూడళ్లు - ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు
జూన్ 2 వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
నగరంలోని ప్రధాన కూడళ్లలో అమరవీరుల స్తూపం ఉన్న గన్ పార్క్ ప్రాంతం, తదితర ప్రాంతాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిబంధనలతో వేడుకలను నిర్వహించనున్నారు.