తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రం నిర్లక్ష్యంతోనే రాష్ట్ర వృద్ధిరేటు తగ్గింది' - తెలంగాణ బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

2020-21 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అరకొరగా విడుదల చేయడం వల్ల రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు తగ్గిందన్నారు.

finance minister harish rao  Introduced budget
'కేంద్రం నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వృద్ధిరేటు తగ్గింది'

By

Published : Mar 8, 2020, 12:39 PM IST

Updated : Mar 8, 2020, 3:37 PM IST

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు గత ఏడాదిన్నర నుంచి తగ్గుతూ వస్తోందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కేంద్ర ఆదాయ వనరులు తగ్గడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాలోనూ, గ్రాంట్లలోనూ కోత పడిందన్నారు. ఆర్థికమాంద్య ప్రభావం రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడిందని మంత్రి వ్యాఖ్యానించారు.

2019-20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.3,731 కోట్లు తగ్గిందన్న మంత్రి.. కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం, నిధులు సకాలంలో రావట్లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా అరకొరగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల 2018-19లో 16.1 శాతంగా ఉన్న రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు.. 6.3 శాతానికి తగ్గిందని తెలిపారు.

'కేంద్రం నిర్లక్ష్యంతోనే రాష్ట్ర వృద్ధిరేటు తగ్గింది'

ఇదీ చూడండి: తెలంగాణ బడ్జెట్‌.. రూ.1,82,914 కోట్లు

Last Updated : Mar 8, 2020, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details