తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ పురపోరులో మరో ముందడుగు - తెలంగాణ తాజా వార్తలు

గ్రేటర్​ వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్ సహా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణలో మరో ముందడుగు పడింది. ​ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది.

state elections commission
మినీ పురపోరులో మరో ముందడుగు

By

Published : Apr 4, 2021, 7:44 AM IST

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతో పాటు పంచాయతీల్లోని ఖాళీలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగవంతమైంది. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం వల్ల.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. 14వ తేదీకి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వార్డుల వారీ రిజర్వేషన్లను ప్రకటిస్తారు. ఆయా పట్టణాల్లో వార్డులవారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియ 11వ తేదీకి పూర్తి కానుంది.

వీటితో పాటు జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది డివిజన్ల జాబితాల రూపకల్పనకూ నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ... పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 14న ఈ ప్రక్రియ పూర్తవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీకి గతంలోనే షెడ్యూల్ ఇచ్చింది. ఈ ప్రక్రియ 12వ తేదీతో పూర్తి కానుంది. నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీచూడండి:సెగలు పుట్టిస్తున్న సాగర్ ఉప ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details