తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో తెరాసకు అనుకూలంగా పనిచేశానని... అందుకు గాను ప్రభుత్వం 15ఎకరాల 25 కుంటల భూమిని తనకి ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తపై ఆయన స్పందించారు. 2014లో మహబూబ్ నగర్లో హేమాజిపూర్లో చట్టబద్దంగా భూమి కొనుగోలు చేశానని... తనవద్ద ఎటువంటి అక్రమ ఆస్తులు లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సైబర్ క్రైంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫిర్యాదు - అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన రజత్‌కుమార్
సామాజిక మాద్యమాల్లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![సైబర్ క్రైంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫిర్యాదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4920299-137-4920299-1572521254361.jpg)
'అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'
ఇదీ చూడండి: స్కూటీ, ఆర్టీసీ బస్ ఢీ.. ఇద్దరు యువతులకు గాయాలు