తెలంగాణ

telangana

ETV Bharat / state

అఖిలపక్షం నేతలతో ఎస్​ఈసీ సమావేశం - మర్రి శశిధర్​రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలు, ఎన్నికల కోడ్​ అమలు, మున్సిపల్​ వార్డుల పునర్వవస్థీకరణ వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నాగిరెడ్డి అఖిల పక్షం నేతలతో సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం

By

Published : Mar 11, 2019, 3:20 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల కమిషనర్​ నాగిరెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషన్​ కార్యాలయంలో కమిషనర్​ నాగిరెడ్డి అఖిల పక్షసమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులు, మున్సిపల్​ వార్డుల పునర్వవస్థీకరణ వంటి అంశాలపై చర్చించారు. తుది ఓటర్ల జాబితా విడుదలయ్యాక కూడా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్​రెడ్డి ఎస్​ఈసీని కోరారు. దొంగ ఓట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. స్థానిక సంస్థలఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించడం సాధ్యం కాదని తెరాస నేత గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఏ ఎన్నికలైనా తెరాసదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details