జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి వచ్చారు.
స్వస్తిక్ గుర్తు లేకున్నా ఓటే... ఈసీ ఉత్తర్వులు - రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులు
బల్దియా ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటింగ్ సమయంలో స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటుగా వేరే ముద్రలను ఇచ్చామని పలువురు ఉద్యోగులు ఈసీ దృష్టికి తీసుకురాగా... ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
స్వస్తిక్ గుర్తు లేకున్నా ఓటే... ఈసీ ఉత్తర్వులు
ఇందుకు పరిష్కారంగా అలాంటి ఓట్లనూ లెక్కించాలని ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.