'విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' - మినీ పురపోరు ఓట్ల లెక్కింపు
13:28 April 28
'విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'
మినీ పురపోరు ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. గెలుపొందిన అభ్యర్థులు, వారి పార్టీలు, అనుచరులు ఎలాంటి ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేసింది.
ధృవీకరణ పత్రం తీసుకునే సమయంలో కూడా గెలిచిన అభ్యర్థితో పాటు... ఇద్దరి కంటె ఎక్కువ మందికి అనుమతి లేదని ఎస్ఈసీ తెలిపింది. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఎన్నికల సంఘం... ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలు, సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలతోపాటు... జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ సహా ఇతర ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు వచ్చే నెల మూడో తేదీన జరగనుంది.
ఇదీ చూడండి :వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎం ఎందుకు చెప్పటం లేదు: బండి సంజయ్