పురపాలక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి నాలుగున వార్డుల వారీగా ఓటర్ల తుదిజాబితా ప్రకటించనున్నారు. అదే రోజు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేయాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఐదో తేదీన కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో ప్రకటించాలి. జాబితాపై ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుంది.
'పుర'పోరుకు పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ ప్రకటన - పురపాలిక పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ ప్రకటన
పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికలసంఘం... తాజాగా పోలింగ్ కేంద్రాల ఖరారు షెడ్యూల్ను ప్రకటించింది. వార్డుల వారీ ఓటర్ల తుదిజాబితా జనవరి నాలుగో తేదీన ప్రకటించనున్నారు.
పురపాలిక పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ ప్రకటన
జనవరి ఏడున మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల స్థాయిలో రాజకీయపార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల విషయమై సమావేశం నిర్వహిస్తారు. అభ్యంతరాలను పరిష్కరించి తొమ్మిదో తేదీన జిల్లా కలెక్టర్లకు అనుమతి కోసం పోలింగ్ కేంద్రాల జాబితాను కమిషనర్లు సమర్పిస్తారు. కలెక్టర్ల ఆమోదం అనంతరం జనవరి 13న వార్డుల వారీ పోలింగ్ కేంద్రాల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఆ పోలింగ్ కేంద్రాల్లోనే జనవరి 22న పురపాలక ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఈసారి బాలాలయంలోనే!!