తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైద్యారోగ్య శాఖలో ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలి' - State Doctors Forum met the Minister eetala

కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్​ను రాష్ట్ర డాక్టర్ల​ ఫోరం కలిసింది. వైద్యారోగ్య శాఖలో ఖాళీలను తక్షణమే రెగ్యులర్​ విధానంలో భర్తీ చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేసింది.

State Doctors  Forum met the Minister eetala
మంత్రి ఈటలను కలిసిన రాష్ట్ర డాక్టర్ల ఫోరం

By

Published : Jul 22, 2020, 6:53 AM IST

Updated : Jul 22, 2020, 9:08 AM IST

వైద్యారోగ్య శాఖలో ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను రాష్ట్ర డాక్టర్ల ఫోరం కోరింది.

కరోనా విపత్తు సమయంలోనూ ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్టు విధానం ద్వారా సేవలు అందిస్తున్న వైద్యులను గుర్తించి.. క్రమబద్ధీకరించేలా చూడాలని విన్నవించారు. ఈ మేరకు కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు.

కొవిడ్​-19 విజృంభిస్తున్నా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని ఫోరం కన్వీనర్ డాక్టర్ రాజ్​కుమార్ జాదవ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృషిలో ఉంచుకుని.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విన్నవించారు.

ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్​లో కాంట్రాక్టు విధానంలో సేవలు అందిస్తున్న వైద్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఇదీచూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

Last Updated : Jul 22, 2020, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details